ఫీల్డ్‌లోకి దిగిన కమిషనర్…పనులపై కఠిన నిఘా

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి సర్కిల్ పరిధిలో శానిటేషన్ పనులపై జోనల్ కమిషనర్ పింకేష్ కుమార్ సోమవారం ఆకస్మికంగా పర్యటించారు. కొంపల్లి సర్కిల్-56లోని సాయిబాబా నగర్, రాజీవ్ గృహకల్ప ప్రాంతాల్లో పరిశుభ్రత పనులను ఆయన స్వయంగా పరిశీలించారు. ప్రత్యేకంగా కన్స్ట్రక్షన్ & డెమోలేషన్ (సి&డి) వ్యర్థాల ఎత్తివేతపై దృష్టి సారించిన కమిషనర్, వీటి తొలగింపులో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని స్పష్టం చేశారు. సమయానికి పూర్తి స్థాయిలో వ్యర్థాలను తొలగించి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సంబంధిత అధికారులకు కఠిన ఆదేశాలు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్