సీసీ రోడ్లు, లైట్లు పూర్తి చేయండి.. డీసీకి విజ్ఞప్తి

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ సర్కిల్ నూతన డిప్యూటీ కమిషనర్ డాక్టర్ ఎస్. వెంకట్ మణి కరణ్‌ను స్థానిక నాయకులు కలిసి శాలువాతో సత్కరించారు. దుండిగల్ తండా-2లో సీసీ రోడ్ల నిర్మాణం, ఐమాక్స్ లైట్ల ఏర్పాటు పనులను త్వరగా పూర్తి చేయాలని, డంపింగ్ యార్డ్‌ను తరలించాలని వినతి పత్రం సమర్పించారు. ప్రజల సమస్యలను సానుకూలంగా స్వీకరించిన డిప్యూటీ కమిషనర్, తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీజే సోను, సందీప్ నాయక్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్