అక్రమ ఆక్రమణలపై దుండిగల్ అధికారుల ప్రత్యేక డ్రైవ్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని దుండిగల్ సర్కిల్ అధికారులు మల్లంపేట ఓఆర్ఆర్ ఎగ్జిట్-4ఏ నుంచి బాచుపల్లి వరకు ఉన్న రహదారిపై ప్రత్యేక ఆక్రమణల తొలగింపు డ్రైవ్ నిర్వహించారు. రహదారిని ఆక్రమించి ఏర్పాటు చేసిన 32 అక్రమ ఫుడ్ స్టాల్స్, ఇతర నిర్మాణాలను గుర్తించగా, ఇప్పటివరకు 24 ఆక్రమణలను తొలగించారు. డిప్యూటీ కమిషనర్ డాక్టర్ ఎస్. వెంకట మణి కరణ్, ఏసీబీ శ్రీనివాస్, టీపీఎస్ ముఖేష్ సింగ్‌తో పాటు టౌన్ ప్లానింగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రహదారుల ఆక్రమణలను సహించబోమని అధికారులు హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్