బౌరంపేటలో సీసీ రోడ్డు పనుల పరిశీలన

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ సర్కిల్ పరిధిలోని బౌరంపేట లహరి గ్రీన్ పార్క్‌లో సుమారు రూ. కోటి వ్యయంతో చేపడుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పరిశీలించారు. పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పిస్తున్నామని, నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ప్రధాన రహదారి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్