కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో రాబోయే వర్షాకాల సన్నద్ధత చర్యల్లో భాగంగా జోనల్ కమిషనర్ పింకేష్ కుమార్ ఐఏఎస్, జీడిమెట్ల ట్రాఫిక్ డివిజన్ ఏసీపీ వై. వెంకటేశ్వర్ రావుతో కలిసి సూరారం, గాయత్రి మెడోస్, బహదురుపల్లి, గండిమైసమ్మ జంక్షన్, మల్లంపేట్ ప్రాంతాల్లో సంయుక్త తనిఖీలు నిర్వహించారు. నీరు నిలిచే ప్రదేశాలు, బ్లాక్ స్పాట్లు, కొనసాగుతున్న పనులను పరిశీలించారు. మల్లంపేట్‌లో డ్రైనేజీ, వాటర్ లాగింగ్ సమస్యలపై స్థలంలోనే సమీక్షించి, పెండింగ్ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.