అంబర్ పేట్ లో బీఎల్ఓ పై స్థానికుల ఆరోపణలు

అంబర్ పేట్ పటేల్ నగర్లో బీఎల్ఓలు ఓటరు జాబితా నమోదుకు అవసరమైన ఫారాలు ఇవ్వడం లేదని స్థానికులు ఆరోపించారు. బూత్ నంబర్ 138లో కుటుంబ సభ్యులు ఓటరు కార్డులు చూపినా, బీఎల్ఓలు ఫారాలు ఇవ్వడం లేదని వాపోయారు. చాలామంది ఉద్యోగాల రీత్యా ఊర్లో లేరని, ఉదయాన్నే పనులకు వెళ్తున్నారని, బీఎల్ఓ ఆలస్యంగా వస్తున్నారని, ఇంటింటికి వెళ్లడం లేదని ఆరోపించారు. ఫారాలు సకాలంలో అందేలా చూసి, అర్హులెవరూ నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్