కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం సర్కిల్ పరిధిలోని దేవేందర్ నగర్ ప్రధాన రహదారిపై శనివారం జీహెచ్ఎంసీ అధికారులు ఆక్రమణలను తొలగించారు. సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్, కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్ ఆదేశాల మేరకు ఈ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ సిబ్బంది కూడా పాల్గొన్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అసిస్టెంట్ సిటీ ప్లానర్ ఆర్. సుమిత్ర, టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్ బి. సరిత సేన్ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.