బహదూర్‌పల్లి 294 డివిజన్‌లో రోడ్ల మరమ్మతులు పూర్తి

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, బహదూర్‌పల్లి 294 డివిజన్ పరిధిలో గుంతలమయంగా మారిన రోడ్లకు ప్యాచ్‌వర్క్ పనులు పూర్తయ్యాయి. తెరిచి ఉన్న మ్యాన్‌హోల్‌లకు కొత్త మూతలు బిగించారు. వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రోటోకాల్ & కోఆర్డినేషన్ వైస్ చైర్మన్ బొంగునూరి కిషోర్ రెడ్డి అధికారులకు సూచించారు. పనులు త్వరగా పూర్తి చేసిన అధికారులకు, సిబ్బందికి 294 డివిజన్ కాంగ్రెస్ నాయకులు ఏ. ఆర్. సాదు యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ హిల్స్ కాలనీ ప్రెసిడెంట్ అమర్ పటేల్‌తో పాటు కాలనీ వాసులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్