కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బహదూర్‌పల్లి 924 డివిజన్‌లోని పలు కాలనీలలో వీధిలైట్ల సమస్యను స్థానికులు కాంగ్రెస్ నాయకుడు బొంగునూరి కిషోర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన అధికారులతో మాట్లాడడంతో వెంటనే స్పందించిన సిబ్బంది సమస్య ఉన్న ప్రాంతాల్లో వీధిలైట్లు ఏర్పాటు చేశారు. సమస్య పరిష్కారానికి సహకరించిన కిషోర్ రెడ్డి, అధికారులకు కాలనీ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.