చట్టాలను తుంగలో తొక్కిన షెడ్ నిర్మాణం…ఎవరి ఆశీర్వాదం?

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దూలపల్లి, కొంపల్లి సర్కిల్ పరిధిలోని అశోక ఎ లా మైసన్ ఎదురుగా అనుమతులు లేకుండా షెడ్ నిర్మాణం జరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. గత 20 రోజులుగా ప్రధాన రహదారి పక్కనే నిర్మాణం కొనసాగుతున్నా, టౌన్ ప్లానింగ్ అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వెంటనే అక్రమ నిర్మాణాన్ని నిలిపివేసి, చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్