ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: మాజీ కార్పొరేటర్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జగద్గిరిగుట్ట డివిజన్ న్యూ రాజీవ్ గాంధీ నగర్‌లో స్థానిక సమస్యల పరిష్కారం కోసం మాజీ కార్పొరేటర్ కొలుకుల జగన్ బస్తీ ప్రజలతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు యూజీడీ, తాగునీరు, సీసీ రోడ్లు వంటి సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. సమస్యల పరిష్కారం కోసం తాను ఎల్లప్పుడూ ప్రజలతోనే ఉంటానని జగన్ తెలిపారు. డివిజన్ అభివృద్ధికి కోట్లాది రూపాయలతో పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. న్యూ రాజీవ్ గాంధీ నగర్‌లో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్