కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ పరిధిలో అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి మల్లంపేట, బౌరంపేట ప్రాంతాల్లోని ఆక్రమణలను తొలగించారు. మల్లంపేటలో ఫుట్‌పాత్‌లపై అక్రమ కట్టడాలను కూల్చివేసి, 100 ఫీట్ల రహదారి విస్తరణ పనులను పరిశీలించారు. బౌరంపేట ఇందిరమ్మ కాలనీలో బతుకమ్మ ప్రాంగణంలో అక్రమంగా నిర్మిస్తున్న దుకాణాల పనులను నిలిపివేశారు. ప్రజా స్థలాలను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.