ప్రజావాణిలో ప్రజల గోడు–అధికారుల ముందు 7 వినతులు

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి సర్కిల్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ ఎన్. కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల సమస్యలు వెలుగులోకి వచ్చాయి. ఈ కార్యక్రమంలో మొత్తం 7 వినతులు స్వీకరించబడ్డాయి. స్మశాన వాటికలో అధిక రుసుములు వసూలు చేస్తున్నారని, సీసీ రోడ్డు అవసరం, భాగ్యలక్ష్మి కాలనీలోని పార్కుల్లో లైట్లు ఏర్పాటు చేయాలని, అనుమతులు లేకుండా నిర్మిస్తున్న వాణిజ్య షెడ్లపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు. కాలనీల్లో నెలకొన్న మౌలిక వసతుల లోపాలు ప్రధానంగా ఫిర్యాదుల్లో కనిపించాయి.

సంబంధిత పోస్ట్