హైదరాబాద్: హైకోర్టులో రేవంత్‌రెడ్డి వేర్వేరు పిటిషన్లు

హైకోర్టులో సీఎం రేవంత్‌ వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. హుజూర్‌నగర్ ఉపఎన్నిక సమయంలో తనపై నమోదైన 4 కేసులు కొట్టివేయాలని ఈ పిటిషన్లలో విజ్ఞప్తి చేశారు. నేరేడుచర్ల, మట్టంపల్లి, పాలకీడు, హుజూర్‌నగర్ పీఎస్‌లలో ఈ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులు కొట్టివేయాలని ఆయన పిటిషన్లు వేశారు. పోలీసులు, ఫిర్యాదు చేసిన ఎన్నికల అధికారులకు కోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది.

సంబంధిత పోస్ట్