మొండా మార్కెట్ డివిజన్ సమస్యలపై కార్పొరేటర్ సమీక్ష

మోండా మార్కెట్ డివిజన్లో శనివారం కార్పొరేటర్ దీపిక, ఎస్ఎఫ్ఏలతో సమీక్ష నిర్వహించారు. శానిటేషన్ సూపర్వైజర్ దేవగౌడ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. డివిజన్లో నెలకొన్న సమస్యలను కార్పొరేటర్ అధికారుల దృష్టికి తీసుకువచ్చి, వాటిపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పకడ్బందీగా శానిటేషన్ పనులు చేపట్టాలని, స్థానికుల నుంచి మరోసారి ఫిర్యాదులు రాకుండా చూడాలని సూచించారు. ఏ సమస్యలు తలెత్తినా వాటి పరిష్కారానికి సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచనలు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్