లాలాపేట హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఎస్‌ఐఆర్ డ్రైవ్ తనిఖీ...

లాలాపేట డివిజన్ లోని బూత్ నంబర్-95 పరిధిలో జరుగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని మెట్టుగూడ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ జ్యోతి తనిఖీ చేశారు. బూత్ ఇంచార్జ్, బీఆర్ఎస్ యువజన విభాగం మాజి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూరెల్లి నాగరాజు గౌడ్ తో కలిసి ఆమె ఎన్యుమరేషన్ ప్రక్రియ, ఓటర్ల వివరాల నమోదు, ఇంటింటి సర్వే తీరును పరిశీలించారు. బీఎల్‌ఓ లు, బీఎల్‌ఏ లతో మాట్లాడి, ఓటర్ల వివరాలను నిబంధనలకు అనుగుణంగా ఖచ్చితత్వంతో నమోదు చేయాలని అధికారులకు సూచించారు.

సంబంధిత పోస్ట్