మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ సమావేశం పురపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్, ఐఏఎస్ అధ్యక్షతన 28.04.2026, మంగళవారం నాడు తార్నాకలోని ఎంఎంసి ప్రధాన కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో ఇంజినీరింగ్, టౌన్ ప్లానింగ్, యూబీడీ, స్పోర్ట్స్, అడ్మినిస్ట్రేషన్ విభాగాలకు సంబంధించిన అజెండా అంశాలపై సమగ్రంగా చర్చించి, ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు.