నాచారం డివిజన్ డ్రైనేజీ సమస్యలు పరిష్కరించండి...

నాచారం డివిజన్లో నెలకొన్న డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి కొత్త పైపులైన్లు ఏర్పాటు చేయాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గురువారం మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ జలమండలి ఈడీ పంకజను కలిసి వినతిపత్రం అందజేశారు. ఇప్పటికే చాలా సమస్యలు పరిష్కరించామని, మిగిలిన పనులకు నిధులు మంజూరు చేస్తే డ్రైనేజీ సమస్యలు పూర్తిగా తీరుతాయని ఈడీ తెలిపారు. కొన్ని మంజూరైన రోడ్లు డ్రైనేజీ ఏర్పాటు కాకపోవడం వల్ల నిలిచిపోయాయని ఎమ్మెల్యే ఈడీ దృష్టికి తీసుకువచ్చారు.

సంబంధిత పోస్ట్