దోమల నియంత్రణకు ఆధునిక పరికరాలతో బలోపేతం

మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీ. వినయ్ కృష్ణా రెడ్డి మంగళవారం మాట్లాడుతూ, దోమల నియంత్రణ చర్యలను మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి ఎంటమాలజీ విభాగాన్ని ఆధునిక పరికరాలతో బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. మల్కాజ్‌గిరి ఎంఎంసి జోనల్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంటమాలజీ విభాగానికి అవసరమైన పరికరాలను పంపిణీ చేశారు. ప్రజారోగ్య పరిరక్షణలో దోమల నియంత్రణకు అత్యంత ప్రాధాన్యత ఉందని, దోమల వ్యాప్తిని అరికట్టేందుకు ఆధునిక సాంకేతిక పరికరాల వినియోగం కీలకమని, అధికారులు వీటిని సమర్థవంతంగా వినియోగించి క్షేత్రస్థాయిలో చర్యలను వేగవంతం చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్