GHMCలో మున్సిపాలిటీల విలీనం తర్వాత, అధికారులు నగరవ్యాప్తంగా అనధికారిక హోర్డింగులు, బ్యానర్లు, ప్రకటనల నిర్మాణాలపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. ప్రజా, రోడ్డు భద్రత, నగర సౌందర్యాన్ని కాపాడేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. అన్ని జోన్లలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, దశలవారీగా ఈ డ్రైవ్ను నిరంతరం చేపడతారు. అనధికారిక ప్రకటనలు ఏర్పాటు చేస్తే కఠినచర్యలు తీసుకుంటామని GHMC హెచ్చరించింది.