TG: హైదరాబాద్ నగరంలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. కూకట్‌పల్లి నియోజకవర్గం బాలాజీనగర్ డివిజన్ పరిధిలోని హబీబ్‌నగర్‌లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ఇక్కడ నాలాను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను గుర్తించి అధికారులు తొలగించారు. పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగించారు. కాగా పలు చోట్ల అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై హర్షం వ్యక్తం చేస్తుండగా.. పలుచోట్ల పేదల నుంచి వ్యతిరేకత వస్తోంది.