TG: రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మంగా ఏర్పాటు చేసిన హైడ్రాకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. హైడ్రా ఆధ్వర్యంలో పునరుద్దీకరించిన బతుకమ్మకుంట చెరువును కేంద్ర అధికారుల బృందం సందర్శించింది. చెరువుల పరిరక్షణకు జాతీయ స్థాయిలో బతుకమ్మకుంట ఒక నమూనా అవుతుందంటూ కితాబు ఇచ్చింది. చెరువు చుట్టూ తిరుగుతూ దశలవారీగా హైడ్రా చేసిన అభివృద్ధిని తెలుసుకుని అభినందించింది.