శ్రీశైలంలో జల విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం

శ్రీశైలం జలాశయం కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిని జెన్‌కో అధికారులు ప్రారంభించారు. అయితే శ్రీశైలం డ్యాంకి ఇన్‌ఫ్లో నిల్‌గా ఉంది. అవుట్ ఫ్లో 32,632 క్యూసెక్కులు ప్రవహిస్తున్నాయి. శ్రీశైలం డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 835.50 అడుగులు నమోదైంది. జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 55.7729 టీఎంసీలుగా నమోదయ్యాయి.

సంబంధిత పోస్ట్