తెలంగాణలో అంగన్వాడీలకు సరఫరా అవుతున్న సరుకుల నాణ్యతపై తనిఖీలు నిర్వహించాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. ఈ మేరకు మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో భేటీ అయ్యారు. అంగన్వాడీలకు అందే సరుకుల నాణ్యతపై రాజీ పడోద్దని స్పష్టం చేశారు. సరైన సరుకులు సరఫరా చేయకపోతే సప్లైయర్ ను బ్లాక్ లిస్టు చేస్తామని హెచ్చరించారు. అప్రమత్తమైన అధికారులు క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేపట్టాలని జిల్లా అధికారులకు ఆదేశాలిచ్చారు.