గృహ, వాణిజ్య అవసరాల కోసం కేంద్రం ప్రవేశపెట్టిన 5 కేజీల “చోటు” ఎల్పీజీ సిలిండర్లు ఉద్యోగులు, వలస కార్మికులు, విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా మారాయి. తక్కువ గ్యాస్ వినియోగం ఉన్న ఇళ్లు, పరిమిత స్థలం ఉన్న చిన్న వాణిజ్య సంస్థలకు కూడా ఇవి అనుకూలంగా ఉన్నాయి. వీటిని కొనుగోలు చేయడానికి లోకల్ అడ్రస్ ప్రూఫ్ అవసరం లేదు. అధీకృత విక్రయ కేంద్రం నుండి కొనుగోలు చేసిన వినియోగదారులు సిలిండర్‌ను ఎప్పుడైనా వాపసు చేయవచ్చు. సిలిండర్‌ను ఎంతకాలం ఉపయోగించినప్పటికీ, వాపసు చేస్తే ప్రతి సిలిండర్‌కు రూ. 500 రీఫండ్ లభిస్తుంది. ఈ ప్రయోజనాల వల్ల చోటు సిలిండర్లు ప్రజాదరణ పొందాయి.