3 బంగారు నగలు మించి వేసుకుంటే జరిమానా.. ఎక్కడంటే?

ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ జిల్లాలో కందద్, ఇంద్రోలి గ్రామాల్లో మహిళలు బంగారు నగలు ధరించడంపై వింత నిర్ణయం తీసుకున్నారు. వివాహాలు, శుభకార్యాల సమయంలో మూడు బంగారు నగలు మాత్రమే ధరించాలని గ్రామ పెద్దలు షరతు విధించారు. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే రూ.50,000 జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఆడంబరాలను అరికట్టడం, ఆర్థిక అసమానతలను తగ్గించడం లక్ష్యంగా ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నట్లు గ్రామ పెద్దలు తెలిపారు. చెవిపోగులు, మంగళ సూత్రం, ముక్కు పుడక మాత్రమే ధరించాలని సూచించారు. స్థానిక మహిళలు ఈ నిర్ణయాన్ని స్వాగతించారు.

సంబంధిత పోస్ట్