రాణి చీమల అక్రమ రవాణా.. ఒక్కోదానికి రూ. 21 వేలు!

ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణుల స్మగ్లింగ్ తరహాలోనే ఇప్పుడు చీమల అక్రమ రవాణా పెరిగిపోతోంది. ముఖ్యంగా రాణి చీమలను స్మగ్లర్లు లక్ష్యంగా చేసుకుంటున్నారు. విమానాశ్రయాల్లో అధికారులు వందల సంఖ్యలో చీమలను ప్యాకెట్లు, టెస్ట్ ట్యూబ్‌లు, సీసాల్లో దాచి తరలిస్తుండగా పట్టుకున్నారు. ఒక్కో రాణి చీమ ధర మార్కెట్‌లో రూ. 21 వేల వరకు పలుకుతోంది. చైనా, యూరప్, అమెరికాలో యాంట్ కీపింగ్ హాబీగా, పరిశోధనల కోసం వీటిని తరలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇది పర్యావరణానికి ముప్పు కలిగించడంతో పాటు, కొత్త వ్యాధులను మోసుకొచ్చే ప్రమాదం ఉందని జీవశాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్