ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దోమల సమస్యను అరికట్టడానికి 'SMoSS' అనే పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తోంది. ఇది ఏఐ సాయంతో దోమల సంఖ్యను గుర్తించి, వాటిని నియంత్రిస్తుంది. ఈ విధానంలో భాగంగా.. దోమల ఉత్పత్తి ఎక్కువగా ఉండే 66 ప్రాంతాల్లో ఏఐ సాయంతో పనిచేసే సెన్సార్లు ఏర్పాటు చేస్తారు. గ్రేటర్ విశాఖలో 16 ప్రాంతాల్లో, కాకినాడలో 4, రాజమహేంద్రవరంలో 5, విజయవాడలో 28, నెల్లూరులో 7, కర్నూలులో 6 ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనుంది.