భారత్ తూర్పు లద్దాఖ్‌లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రోడ్డును నిర్మించి సరికొత్త రికార్డును సృష్టించింది. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్ఓ) మిగ్ లా పాస్ వద్ద 19,400 అడుగుల ఎత్తులో ఈ రోడ్డును నిర్మించింది. ఈ రోడ్డు వాహనాల రాకపోకలకు సిద్ధంగా ఉంది. హాన్లే ప్రాంతాన్ని ఫుక్చే గ్రామంతో అనుసంధానించే ఈ రోడ్డు, వాస్తవాధీన రేఖకు సమీపంలో ఉంది. గతంలో గిన్నిస్ ప్రపంచ రికార్డు పొందిన ఉమ్లింగ్ లా (19,024 అడుగులు) రికార్డును అధిగమించింది.