భారత పర్యాటక రంగం గణనీయంగా వృద్ధి చెందుతోంది. 2025లో దేశీయ పర్యాటకుల సంఖ్య 428.55 కోట్లకు, విదేశీ పర్యాటకుల సంఖ్య 2.53 కోట్లకు చేరినట్లు కేంద్ర గణాంకాలు వెల్లడించాయి. దీంతో రూ.2,76,831 కోట్ల విదేశీ మారకద్రవ్యం లభించింది. 2023-24లో పర్యాటక రంగం జీడీపీలో 5.22% వాటా అందించడంతో పాటు 8.46 కోట్ల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కల్పించింది. ఈ-వీసా, AI ఆధారిత ‘ఇన్క్రెడిబుల్ ఇండియా’ వంటి డిజిటల్ కార్యక్రమాలతో పర్యాటక సేవలను మరింత సులభతరం చేస్తున్నారు.