అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణపై స్పందించిన భారత్

అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని భారత్ స్వాగతించింది. ఇది పశ్చిమ ఆసియాలో శాశ్వత శాంతికి మార్గం సుగమం చేస్తుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ బుధవారం ఒక ప్రకటనలో ఆశాభావం వ్యక్తం చేసింది. ఉద్రిక్తతలను తగ్గించడానికి చర్చలు, దౌత్యం అవసరమని, హోర్ముజ్ జలసంధి గుండా నిరాటంకమైన నౌకాయాన స్వేచ్ఛ కొనసాగాలని భారత్ ఆశిస్తోంది. పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో కుదిరిన ఈ ఒప్పందం, నెలన్నర రోజులుగా సాగుతున్న యుద్ధానికి తాత్కాలిక విరామం ఇచ్చింది.

సంబంధిత పోస్ట్