భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ ప్రకారం, చైనా, నేపాల్, వియత్నాం నుంచి దిగుమతి అయ్యే ఎంపిక చేసిన స్టీల్ ఉత్పత్తులపై 12 శాతం వరకు సుంకం విధించనుంది. ఈ సుంకం మూడు సంవత్సరాల పాటు అమలులో ఉంటుంది, క్రమంగా తగ్గుతూ వస్తుంది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమిడీస్ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇది దేశీయ ఉక్కు పరిశ్రమకు ఊరటనిస్తుందని భావిస్తున్నారు.