మరోసారి అమెరికా దౌత్యవేత్తకు భారత్‌ సమన్లు

భారత విదేశాంగ శాఖ దిల్లీలోని అమెరికా దౌత్యవేత్త జేసన్‌ మీక్స్‌కు మరోసారి సమన్లు జారీ చేసింది. గత నాలుగు రోజుల్లో ఒమన్ తీరంలో భారతీయులతో వెళ్తున్న నౌకలపై మూడు సార్లు దాడులు జరిగాయి. గురువారం కూడా ఓ నౌకపై దాడి జరగ్గా 20 మంది భారత సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. ఈ దాడులను ఖండించిన భారత్, తాజాగా అమెరికా రాయబారికి సమన్లు జారీ చేసింది. అంతకుముందు ఓ నౌకపై దాడి ఘటనలో ముగ్గురు భారతీయులు గల్లంతైన సమయంలోనూ భారత్ సమన్లు జారీ చేసింది.

సంబంధిత పోస్ట్