సౌర విద్యుత్ ఉత్పత్తిలో భారత్ మరో కీలక మైలురాయిని చేరుకుంది. అంతర్జాతీయ పునరుత్పాదక ఇంధన సంస్థ (ఇరేనా) నివేదిక ప్రకారం 2025లో భారత్ కొత్తగా 37 గిగావాట్ల సోలార్ సామర్థ్యానికి చేరి, 34 గిగావాట్లు సాధించిన అమెరికాను అధిగమించింది. దీంతో చైనా (315 గిగావాట్లు) తర్వాత ప్రపంచంలోనే రెండో వేగంగా సౌర విద్యుత్ విస్తరిస్తున్న దేశంగా నిలిచింది. ప్రస్తుతం దేశంలో మొత్తం సోలార్ సామర్థ్యం 154 గిగావాట్లకు చేరింది.