మహిళల జూనియర్ ఆసియా కప్ హాకీ టోర్నీలో భారత్ విజేతగా నిలిచింది. ఫైనల్లో చైనాను 1-0 తేడాతో ఓడించి, వరుసగా మూడోసారి ఈ కప్ను కైవసం చేసుకుంది. ఈ విజయంతో భారత జట్టు జూనియర్ ప్రపంచ కప్లో స్థానం సంపాదించింది. విజేతలుగా నిలిచిన భారత క్రీడాకారిణులకు హాకీ ఇండియా రూ.3 లక్షల చొప్పున, సహాయక సిబ్బందికి రూ.1.5 లక్షల చొప్పున నగదు బహుమతిని ప్రకటించింది.