హోలీ పండుగ.. ప్రత్యేక రైళ్లు నడపనున్న భారతీయ రైల్వే

హోలీ పండుగ సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్థం భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 1,244 ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. మార్చి 18 వరకు ఈ ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయి. సాధారణ రైళ్లలో రద్దీని తగ్గించి, ప్రయాణికులకు సులభంగా ప్రయాణించేలా ఈ చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా ఉత్తర, తూర్పు రాష్ట్రాల వైపు వెళ్లే ప్రయాణికులకు ఇది ఉపశమనం కలిగించనుంది. తెలుగు రాష్ట్రాల కోసం దక్షిణ మధ్య రైల్వే 16 ప్రత్యేక రైళ్లను కేటాయించింది. సికింద్రాబాద్, తిరుపతి వంటి స్టేషన్ల నుంచి ఈ రైళ్లు నడుస్తాయి.

సంబంధిత పోస్ట్