ప్రపంచ షాట్‌గన్‌ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా భారతీయుడు

ప్రపంచ షాట్‌గన్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత వెటరన్‌ షూటర్‌ జొరావర్‌ సంధు కాంస్య పతకం సాధించాడు. ఫైనల్లో 48 ఏళ్ల సంధు 31 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. క్రొయేషియాకు చెందిన జోసిప్‌ గ్లాస్‌నోవిచ్‌ స్వర్ణం, స్పెయిన్‌కు చెందిన అండ్రెస్‌ గర్సియా రజతం గెలుచుకున్నారు. టీమ్‌ విభాగంలో భారత జట్టు పదో స్థానంలో నిలిచింది. మహిళల ట్రాప్‌లో అషిమా అహ్లావత్‌ 40వ స్థానంతో సరిపెట్టుకుంది.

సంబంధిత పోస్ట్