భారతదేశంలో పిల్లలు కనడంపై ఆసక్తి తగ్గిందని UNFPA నివేదికలో వెల్లడైంది. 2025 ప్రపంచ జనాభా స్థితి నివేదిక ప్రకారం.. భారత సంతానోత్పత్తి రేటు ప్రతి మహిళకు 1.9కి పడిపోయింది. ఇది అవసరమైన స్థిరత్వ రేటైన 2.1 కన్నా తక్కువ. దీనికి ఆర్థిక భారమే ప్రధాన కారణమని పేర్కొన్నారు. మూడు కుటుంబాల్లో ఒకటికి పిల్లల ఖర్చులు భరించే సామర్థ్యం లేదని UNFPA అంచనా వేసింది.