ఇండిగో భారీ ఆఫర్: రూ.10 వేల వోచర్లతో ప్రయాణికులకు ఊరట

గతవారం అంతరాయం కారణంగా వేలాది విమానాలు రద్దు, ఆలస్యం కావడంతో తీవ్రంగా ప్రభావితమైన ప్రయాణికులకు రూ.10 వేలు విలువైన అదనపు ట్రావెల్‌ వోచర్లను జారీ చేయనున్నట్లు ఇండిగో గురువారం ప్రకటించింది. ఈ వోచర్లు డిసెంబర్‌ 3, 4, 5 తేదీల మధ్య ప్రయాణించిన వారికి మాత్రమే వర్తిస్తాయి. ఈ వోచర్లను రాబోయే 12 నెలల్లో ఇండిగోలో చేసే ఏ ప్రయాణానికైనా ఉపయోగించుకోవచ్చు. ఈ గందరగోళం కారణంగా కస్టమర్లు చాలా గంటల పాటు విమానాశ్రయాల్లో చిక్కుకుపోయారని అంగీకరిస్తూ, సంస్థ క్షమాపణలు తెలిపింది.

సంబంధిత పోస్ట్