ఇందిరా మహిళా శక్తి పథకం.. మహిళలకు మరో 40 పెట్రోల్ బంక్‌లు

TG: రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ‘ఇందిరా మహిళా శక్తి’ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్‌లో భాగంగా మహిళలకు పెట్రోల్ బంకులు మంజూరు చేస్తున్నారు. తాజాగా మరో 40 పెట్రోల్ బంక్‌లు సిద్ధమవనుండగా స్థలాల ఎంపికను పూర్తి చేసి తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. ఇందులో 20 బంకులను జూన్‌ 2 నాటికి పూర్తి చేసి, ప్రారంభించాలని సెర్ప్‌‌కు అధికారులు ఆదేశాలిచ్చారు. మడికొండ, మైలారం(BHPL), రఘునాథపల్లి, రాయపర్తిలో ఈ బంక్‌లను ఏర్పాటు చేయనున్నారు.

సంబంధిత పోస్ట్