'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా'.. ప్రారంభం ఎప్పుడంటే?

TG: రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కుటుంబానికి బీమా కల్పించే లక్ష్యంతో నవంబర్ 19న 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' పథకాన్ని ప్రారంభించనుంది. ఈ పథకం కింద, ఇంటి యజమాని మరణిస్తే రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించబడుతుంది. అయితే, ఈ కొత్త పథకం అమలు నేపథ్యంలో 'రైతు బీమా' పథకాన్ని నిలిపివేసినట్లు సమాచారం. ప్రస్తుతం 42.16 లక్షల మంది రైతులు రైతు బీమా పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. ఇప్పుడు 'ఇందిరమ్మ బీమా'ను అన్ని కుటుంబాలకు విస్తరించనున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕