వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు రద్దు!

TG: అర్హులైన పేదలకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే హౌసింగ్ వెరిఫికేషన్ అధికారులు చేపట్టిన తనిఖీల్లో 1,950 మంది అనర్హులు ఈ పథకం ద్వారా ఇళ్లు పొందినట్లు గుర్తించారు. దీంతో వారి ఇళ్లను రద్దు చేశారు. అలాగే వారి స్థానంలో కొత్త లబ్ధిదారులను ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు అనర్హులను ఎంపిక చేయడంపై శాఖాపరమైన చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్