తెలంగాణ ప్రభుత్వం 'ఇందిరమ్మ ఇండ్లు' పథకాన్ని రాష్ట్రంలోని ప్రధాన పట్టణాలకు విస్తరిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అర్బన్ హౌసింగ్ ప్రోగ్రామ్లో భాగంగా రవాణా, రోడ్లు, భవనాల శాఖ నిజామాబాద్, వరంగల్, హన్మకొండ, నల్గొండ, మహబూబ్ నగర్ నగరాల్లో G+5 పద్ధతిలో అపార్ట్మెంట్ టవర్ల నిర్మాణానికి పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. పట్టణాల్లోని పేదలకు మెరుగైన వసతులతో కూడిన పక్కా గృహాలను అందించడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. CURE ప్రాంతం తరహాలో డిమాండ్-సర్వే, ఆర్థిక నమూనా ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తారు.