విజయవాడ ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డులో అత్యవసర మరమ్మతుల కారణంగా సెప్టెంబర్ 22 నుండి వారం రోజుల పాటు వాహనాల రాకపోకలను, కాలినడక ప్రయాణాలను నిషేధించారు. ఈవో సీనా నాయక్ ఈ విషయాన్ని తెలిపారు. భక్తులు శ్రీ కనకదుర్గ నగర్ మీదుగా కొండపైకి వెళ్లాలి. హైదరాబాద్ వైపు నుంచి వచ్చే వాహనాలను పున్నమి ఘాట్ వద్ద, విశాఖ/చెన్నై వైపు నుంచి వచ్చే వాహనాలను 'సీతమ్మ వారి పాదాలు' వద్ద పార్కింగ్ చేయాలి. అక్కడి నుంచి దుర్గగుడికి చేరుకోవడానికి ఆలయ యంత్రాంగం ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది.