రోడ్డు ప్రమాదాల్లో మరణించిన డ్రైవర్ల కుటుంబాలకు రూ.కోటి బీమా సాయం

రోడ్డు ప్రమాదాల్లో మరణించిన ఇద్దరు డ్రైవర్ల కుటుంబాలకు TGSTRC ఒక్కొక్కరికి కోటి రూపాయల చొప్పున ప్రమాద బీమా సాయం అందించింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారంతో, పికెట్ డిపోకు చెందిన శ్రీనివాసరెడ్డి, పరిగి డిపోకు చెందిన సుధాకర్ కుటుంబాలకు ఈ ఆర్థిక సహాయం అందింది. యూనియన్ బ్యాంక్ అందిస్తున్న సూపర్ సాలరీ సేవింగ్ ఖాతా ద్వారా ఈ ఉచిత ప్రమాద బీమా సౌకర్యం లభించింది. ఉద్యోగుల సంక్షేమానికి సంస్థ ప్రాధాన్యత ఇస్తుందని, ఇలాంటి పథకాలు అపద సమయంలో ఎంతో ముఖ్యమని TGSTRC వీసీ, ఎండీ వై నాగిరెడ్డి పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్