చాలామందికి తెలియని విషయం ఏమిటంటే.. డెబిట్ కార్డులతో పాటు బ్యాంకులు కాంప్లిమెంటరీ లైఫ్ ఇన్సూరెన్స్ కవర్‌ను అందిస్తున్నాయి. ఈ బీమా కవర్ కొన్ని షరతులకు లోబడి ఉంటుంది, ఉదాహరణకు డెబిట్ కార్డు హోల్డర్ నిర్దిష్ట కాలంలో కనీసం ఒక లావాదేవీనైనా చేసి ఉండాలి. ఈ పాలసీ సాధారణంగా గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీలో భాగంగా వ్యక్తిగత ప్రమాదం, విమాన ప్రమాదం, కార్డు మోసం వంటి వాటిని కవర్ చేస్తుంది. హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ వంటి ప్రముఖ బ్యాంకులు ఈ ఉచిత బీమాను అందిస్తున్నాయి.