తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షల ఫీజు వివరాలను ప్రకటించింది. విద్యార్థులు ఈనెల 26 నుంచి నవంబర్ 9 వరకు ఎలాంటి పెనాల్టీ లేకుండా ఫీజు చెల్లించవచ్చు. NOV 11 నుంచి 20 వరకు రూ.100, 22 నుంచి 29 వరకు రూ.500, DEC 1 నుంచి 7 వరకు రూ.1,000, 9 నుంచి14 వరకు రూ.2,000 లేట్ ఫీజుతో చెల్లించవచ్చు. ఫస్ట్ ఇయర్ జనరల్ రెగ్యులర్ ఫీజు రూ.540, ఒకేషనల్ రూ.890గా నిర్ణయించారు. సెకండ్ ఇయర్ జనరల్ ఆర్ట్స్ రూ.540, సైన్స్ రూ.890 మరియు ఒకేషనల్ కోర్సులకు రూ.890 ఫీజుగా బోర్డు ఖరారు చేసింది.