చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం యథాతథంగా కొనసాగించింది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో జులై-సెప్టెంబర్ త్రైమాసికానికీ వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయకుండా వరుసగా తొమ్మిదో త్రైమాసికం అదే రేట్లు అమలు చేయనున్నట్లు ఆర్థిక శాఖ ప్రకటించింది. దీంతో సుకన్య సమృద్ధి యోజనపై 8.2%, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), మూడేళ్ల టర్మ్ డిపాజిట్‌పై 7.1%, కిసాన్ వికాస్ పత్రపై 7.5%, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్‌పై 7.7%, మంత్లీ సేవింగ్స్ స్కీమ్‌పై 7.4%, పోస్టాఫీస్ సేవింగ్స్ డిపాజిట్‌పై 4% వడ్డీ కొనసాగనుంది.