తెలంగాణ సచివాలయంలో బుధవారం ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడంతో పలు ప్రభుత్వ శాఖల్లో పౌర సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మీడియా సెంటర్, పబ్లిసిటీ సెల్, ఎన్ఆర్ఐ అసిస్టెన్స్ సెల్ వంటి విభాగాల్లో నెట్వర్క్ సమస్యల కారణంగా ప్రభుత్వ కార్యకలాపాలు నిలిచిపోయాయి. వివిధ పనుల నిమిత్తం సచివాలయానికి వచ్చిన ప్రజలు సేవలు అందక తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.