ఢిల్లీలో భద్రతా కారణాల దృష్ట్యా ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. జంతర్ మంతర్ వద్ద CJP ఆందోళనలు చేపట్టింది. ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్కు వ్యతిరేకంగా CJP నిరసనలు తెలిపింది. దీంతో 11 మెట్రో స్టేషన్ల ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలను మూసివేశారు. అలాగే జంతర్ మంతర్, కన్నాట్ ప్లేస్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.